Ram Charan Birthday | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నేడు తన 40వ పుట్టినరోజుని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖలంతా సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చరణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా.. తాజాగా సాయిధరమ్ తేజ్ చరణ్‌కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపాడు.
‘నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు.. తీసుకో బావ నా ఈ బండ ప్రేమను’ అంటూ ఎక్స్ వేదికగా తన బావ చరణ్‌కి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నీ బండ బావమరిది, బండ ప్రేమ తప్ప ఏమి ఇవ్వగలుగుతాడు..తీసుకో బావ నా ఈ బండ ప్రేమను
Happy Birthday Charannnnn @alwaysramcharan pic.twitter.com/kwKsht2GUm
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 27, 2025