Sai dharam Tej | ఆసక్తి రేకెత్తిస్తున్న సాయిధరమ్ తేజ్ SDT15 మూవీ గ్లింప్స్..!
రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'రిపబ్లిక్' మూవీ రిలీజై కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈయన కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడితో ఓ మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు.
SDT15 Glimps | రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘రిపబ్లిక్’ మూవీ రిలీజై కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈయన కార్తిక్ దండు అనే కొత్త దర్శకుడితో ఓ మిస్టరీ థ్రిల్లర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన ప్రీలుక్ పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు తారక్ వాయిస్ ఓవర్ అందించడం విశేషం.
అజ్ఞానం భయానికి మూలం, భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతుచిక్కనప్పుడు అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన గ్లింప్స్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. గ్లింప్స్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు విరూపాక్ష అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు గ్లింప్స్‌లో తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది.
మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఒక ఊరిని వరుస చావులు వెంబటిస్తుంటాయి. ఆ చావులకు గల కారణాలు ఏంటీ అని తెలుసుకోవాడానికి హీరో ఆ ఊరికి వెళ్తాడు. అయితే అక్కడ ఆ హీరోకు ఎలాంటి పరిస్థతులు ఎదురయ్యాయి. అసలు ఆ చావుల వెనక ఉన్న మిస్టరీ ఎంటీ అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టాక్. ఈ చిత్రంలో బ్లాక్ మేజిక్ వంటి అంశాలను టచ్ చేశారట. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాయి ధరమ్‌కు జోడీగా సంయుక్త హెగ్డే నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

