టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తోన్న బైలింగ్యువల్ ప్రాజెక్ట్ విరూపాక్ష (Virupaksha). తెలుగు, తమిళ భాషల్లో SDT15 చిత్రంగా వస్తోంది. ఇప్పటికే విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ (Virupaksha Title Glimpse) వీడియో విడుదల చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు (Karthik Dandu) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్.
విరూపాక్ష ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉండండి.. సుప్రీం హీరో విరూపాక్ష టీజర్ మార్చి 1న విడుదల కానుంది.. అంటూ మేకర్స్ టీజర్ అప్డేట్ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ మూవీలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాంతార చిత్రానికి గూస్బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అంజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. విరూపాక్ష చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
బ్రహ్మాజీ, అజయ్, సునీల్ విరూపాక్షలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ దీంతోపాటు సముద్రఖని దర్శకత్వంలో మల్టీస్టారర్ వినోధయ సీతమ్ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఇటీవలే విడుదలైన వర్కింగ్ స్టిల్స్ కూడా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
టీజర్ అప్డేట్ వీడియో..
Get ready to Enter the World of #Virupaksha 👁️🔍
'Supreme Hero' @IamSaiDharamTej's #VirupakshaTeaser will be out on March 1st 📣💥#VirupakshaOnApril21st #CourageOverFear@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish pic.twitter.com/DoP7cRI2ME
— SVCC (@SVCCofficial) February 26, 2023
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
రిస్కీ బైక్ స్టంట్ గ్లింప్స్ వీడియో..
విరూపాక్ష తమిళ టైటిల్ గ్లింప్స్ వీడియో..
Read Also :
SSMB 28 | మహేశ్‌బాబుతో వన్స్‌మోర్.. ఎస్ఎస్ఎంబీ 28లో టాలెంటెడ్ యాక్టర్..!
Mahesh babu | సూపర్ యంగ్ లుక్‌లో మహేశ్ బాబు.. యాడ్ వీడియో వైరల్
Anikha Surendran | ఈ సారి కొంచెం హాట్‌గా.. అనిఖా సురేంద్రన్ ప్రమోషన్స్ స్టిల్స్ వైరల్