Sai Dharam Tej : మీ ప్రేమకు కృతజ్ఞతలు

గత నెలలో జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువహీరో సాయిధరమ్‌తేజ్ క్రమంగా కోలుకుంటున్నారు. యాక్సిడెంట్ ఆనంతరం కొద్దిరోజుల పాటు కోమాలోకి వెళ్లారాయన. భుజానికి నిర్వహించిన శస్త్ర చికిత్స కూడా విజయవంతమైంది. మరికొద్దిరోజుల్లో ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని తెలిసింది. కాగా సాయిధరమ్‌తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం ఇటీవలే విడుదలై విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఆదివారం ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు సాయిధరమ్‌తేజ్. ‘మీరందరు నాపై చూపించిన ప్రేమాభిమానాలను వ్యక్తపరచడానికి మాటలు చాలడం లేదు. కృతజ్ఞత అనేది చాలా చిన్నపదంలా అనిపిస్తున్నది. త్వరలో మిమ్మల్ని కలుస్తా’ అని సాయిధరమ్‌తేజ్ పేర్కొన్నారు. ప్రమాద అనంతరం ఆయన తొలిసారి చేసిన ట్వీట్‌తో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయిధరమ్‌తేజ్ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

