రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) పూర్తిగా కోలుకున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ మునుపటి ఎనర్జీతో సెట్స్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సుప్రీమ్ హీరో జాయిన్ కాబోతున్న ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు. భమ్ భోలేనాథ్ ఫేం కార్తీక్ దండు (Karthik Dandu) డైరెక్ట్ చేస్తున్న మిస్టరీ థ్రిల్లర్ (mystery thriller) షూటింగ్ షురూ చేయనున్నాడు.
ఈ సినిమా చిత్రీకరణ గతంలోనే మొదలు కావాల్సి ఉండగా..కోవిడ్ సంక్షోభం, రోడ్డు ప్రమాదం లాంటి కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది.ఫైనల్‌గా ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయింది సాయిధరమ్ టీం. ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం. సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings), బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచి మొదలు కానుంది.
సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కొంతకాలంగా సరైన హిట్స్ లేని సాయిధరమ్‌కు ఈ సినిమాతో మంచి హిట్టు రావాలని విష్ చేస్తున్నారు అభిమానులు.
దీంతోపాటు సముద్రఖని డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటించబోతున్న మల్టీస్టారర్ ప్రాజెక్టులో సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కల్యాన్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించనున్నాయి.