Sai Dharam Tej | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు ఇప్పుడు హిట్ చాలా అవసరం. నాలుగేళ్ల కిందట వచ్చిన ప్రతిరోజు పండగ సాయి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత రిలీజైన సోలో బ్రతుకే మూవీ సో సోగానే నడిచింది. ఇక రిపబ్లిక్ సినిమాను ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో సాయి తేజ్ మార్కెట్ కాస్త డల్ అయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ విరూపాక్ష సినిమాపైనే ఉన్నాయి. కార్తిక్ దండూ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా కూడా బాగుందనే టాక్ వినిపిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో ఓ హీరోయిన్‌కు ప్రపోజ్ చేశాడట. కానీ ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండటంతో తప్పుకున్నాడట. ఇదే విషయాన్ని సాయితేజ్ తెలిపాడు. విరూపాక్ష ప్రమోషన్లలో భాగంగా సాయితేజ్ సినిమా విషయాలతో పాటుగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. కాగా తాను తిక్క సినిమా హీరోయిన్ లారిస్సా బోనేసిని ఫస్ట్ టైమ్ చూడగానే ఇష్టపడ్డానని సాయితేజ్ చెప్పాడు. తిక్క సినిమాలో ఓ సాంగ్ షూట్ చేస్తుండగా లారిస్సాకు ప్రపోజ్ చేశానని, ఇష్టమైతే డేటింగ్ చేద్దాం అని ఆమెతో అన్నట్లు తెలిపాడు. అయితే లారిస్సాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పడంతో బాధపడ్డా అని తెలిపాడు.
ఇక గతంలోనూ సాయితేజ తనకు లారిస్సా అంటే ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇక తిక్క సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో లారిస్సాకు టాలీవుడ్లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేవు. ఇక సాయితేజ్ నటించిన విరూపాక్ష భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను నిర్మించాడు.