Sai Dharam Tej 18 | మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టాడు. గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఈ నటుడు మరో క్రేజీ కాంబోను లైన్లో పెట్టాడు. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి తేజ్ తన కొత్త సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాతోనే రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. SDT18గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ నేడు షూటింగ్ ప్రారంభించిందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీనితో పాటు ఒక పోస్టర్‌ను వదిలారు.
ఇక ఈ పోస్టర్ చూస్తే.. సాయి ధరమ్ తేజ్ ఇందులో శక్తివంతమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టర్లో అతని రాక కోసం ఎదురుచూస్తున్న భూమి. అతను లోతుల నుండి పైకి లేచాడు అంటూ రాసుకోచ్చారు. ఈ మూవీపై దర్శకుడు మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసమే నిర్మించిన ఓ భారీ సెట్‌తో తొలిషెడ్యూల్ జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఎస్డీటీ 18 రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అన్నారు.
MY NEXT #SDT18 ✊
This one will be more than special.Need all your love & blessings 🙏🏼
All the best to us @rohithkp_dir 🤗
Glad to be associating with @niran_reddy @chaitanyaniran & @Primeshowtweets pic.twitter.com/wFhvFAELZb
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 21, 2024