Air Purifiers | ఎయిర్ ప్యూరిఫైయర్స్‌పై జీఎస్టీ తగ్గింపు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను వ్యతిరేకించిన కేంద్రం
Air Purifiers | దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్స్‌పై జీఎస్టీ తగ్గింపు (GST Cut On Air Purifiers) అంశంపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
Air Purifiers | దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్స్‌పై జీఎస్టీ తగ్గింపు (GST Cut On Air Purifiers) అంశంపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జీఎస్టీ తగ్గింపు అంశంపై వివరణాత్మక స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి 10 రోజుల సమయం ఇచ్చింది.
ఢిల్లీలోని గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నందువల్ల ఎయిర్ ప్యూరిఫైయర్ల (Air Purifiers)ను మెడికల్ డివైసెస్గా వర్గీకరించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్ కపిల్ మదన్ ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రెండు రోజుల క్రితం విచారణ జరిపిన న్యాయస్థానం దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫయర్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎందుకు తాత్కాలికంగా మినహాయించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక ఈ అంశంపై ఢిల్లీ కోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం తీసుకునేందుకు జీఎస్టీ మండలికి ఇబ్బందేమిటని ప్రశ్నించింది.
అయితే, ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కేంద్రం వ్యతిరేకించింది. అది ఆమోదయోగ్యం కాదని వాదించింది. వైద్య పరికరాల వర్గీకరణను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందని, ఈ విషయంపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ ఒక రాజ్యాంగ సంస్థ అని.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో పాల్గొంటున్నందున జీఎస్టీ తగ్గింపు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయలేమని కేంద్రం తరపున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకట్రామన్ అన్నారు. ఈ విషయంపై వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. దీంతో కోర్టు 10 రోజుల సమయం ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 9కి వాయిదా వేసింది.
Also Read..
Hit And Drag | మద్యం మత్తులో బైక్‌ను ఢీ కొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్
UP Man Kills Wife | రహస్యంగా మొబైల్ వాడుతోందని.. భార్యను హత్య చేసి.. దృశ్యం సినిమాను తలపించే సీన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

