టేక్మాల్: వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul Raj) అన్నారు. టేక్మాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, ఐపీ, ఫార్మసీ, ల్యాబ్, టాయిలెట్స్, పరిశీలించారు. వైద్యులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల కేసులు, వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
దవాఖానలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికి అందుబాటులో వైద్య సేవలు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.