కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని (Samuthirakani) పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో వినోధయ్ సీతమ్ (Vinodaya Sitham) రీమేక్ చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నారు పవన్ అండ్ టీం. ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కీ రోల్ చేస్తున్నాడు. కాగా పవన్ కల్యాణ్ ఈ రీమేక్ కోసం 20 రోజులు డేట్స్ ఇచ్చినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. రీమేక్‌కు సాయిధరమ్ కూడా బల్స్ డేట్స్ ఇచ్చాడట.
తాజా అప్ డేట్ ప్రకారం ఈ సినిమా కోసం 3నెలలు టైం ఇచ్చాడట. ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్‌తో థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ ప్రాజెక్టు పూర్తి వివరాలపై త్వరలోనే క్లారిటీ రానున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే పవన్ నటించిన అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ భీమ్లానాయక్, పింక్ రీమేక్ వకీల్ సాబ్ బాక్సాపీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి.
వినోధయ సీతమ్ రీమేక్‌తో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. మొదట క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొననున్నట్టు టాక్. మరోవైపు రీమేక్ షూటింగ్‌కు కూడా టైం ఇవ్వనున్నాడట.