‘జీవితం అంటే కష్టాలు వస్తాయి.. వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిందే. బాధలకు వెరవకూడదు. యాక్సిడెంట్ తరువాత చిరంజీవి గారు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అనే కొటేషన్‌ను పంపించారు. దాని ప్రేరణతోనే నేను ఇప్పుడు మీ ముందు వున్నాను’ అన్నారు హీరో సాయిధరమ్ తేజ్. ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురైన ఈ యువ కథానాయకుడు కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్‌తో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
ఇప్పుడు కాస్త వయసు పెరిగింది. మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, సంతోషంగా వుంచాలని అనుకుంటున్నాను.
80, 90వ దశకాలలో జరిగే కథ ఇది. వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లకు కారణం ఏమిటి? ఊరి మీద చేతబడి చేయించారా? చేస్తే ఎవరు చేసి వుంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ విరూపాక్ష. ‘విరూపాక్ష’ అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపంలేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం.
మొదటిసారి ఇలాంటి కొత్త జానర్ చేశాను. నేను ఇంతకు ముందు నటించాను. కానీ ఇప్పుడు మాత్రం జీవించాను. ప్రతి ఒక్క హీరోకి ప్రతి సినిమా మొదటి సినిమాలానే వుంటుంది. అలానే కష్టపడతారు.
ఈ సినిమా విషయంలో మీ అమ్మగారికి కృతజ్ఞతలు చెబుతున్నారు హారర్ సినిమాలు చూడటం వేరు, చేయడం వేరు. ప్రమాదం జరిగిన తరువాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని అంతా అనుకున్నారు. కానీ మా అమ్మ నాకు మళ్లీ మాటలు నేర్పించారు. నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మనం ఏది చేసినా అమ్మానాన్నలు, గురువు కోసం చేయాలి.
ఈ చిత్రం కోసం వర్క్‌షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి ఏమీ బాగా లేదు. నేను చేయలేని పరిస్థితుల్లో ఉంటే కూడా అడ్జస్ట్ అయ్యేవారు. మా నిర్మాతలు నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. ఆ విషయంలో వారికి వంద మార్కులు ఇవ్వాల్సిందే.
నా జీవితం అంతా సవాళ్లతోనే నిండింది. నేను ఎప్పుడూ కొత్త సవాళ్లని స్వీకరించేందుకు సిద్దంగానే వుంటాను.అయినా సవాళ్లనేవి లేకుంటే జీవితం చప్పగా అనిపిస్తుంది.
నాకు మాస్ ఇమేజ్ వచ్చిందని, లార్జర్ దెన్ లైఫ్ పాత్ర వచ్చిందని నేను ఎప్పుడూ అనుకోలేదు. విరూపాక్ష సినిమాకు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వుంటారు. కానీ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటుంది.