Sai Dharam Tej | టాలీవుడ్లో చాలా కాలం తర్వాత రాబోతున్న పక్కా మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష (Virupaksha). కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్నాడు. రూరల్ ఏరియా నేపథ్యంలో సాగే కథతో ఇటీవల కాలంలో ఎవరూ టచ్ చేయని మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు విరూపాక్ష టీజర్ చెబుతోంది. ఈ జోనర్లో వచ్చిన తులసీదళం, కాష్మోరా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రాబట్టుకున్నాయి.
సాధారణంగా రియలిస్టిక్ హార్రర్, మిస్టిక్ థ్రిల్లర్లు చాలా అరుదనే చెప్పాలి. ఇదే జోనర్లో చాలా కాలం క్రితం చంద్రముఖి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) . చంద్రముఖి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఆ తర్వాత మళ్లీ ఆ జోనర్లో లీడింగ్ హీరో సినిమా చేసింది లేదనే చెప్పాలి. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) పూర్తి స్థాయిలో ఇదే జోనర్లో విరూపాక్ష సినిమా చేస్తున్నాడని అంటున్నారు టీజర్ చూసిన ట్రేడ్ విశ్లేషకులు.
విరూపాక్ష ట్రైలర్‌ను రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. థ్రిల్-మిస్టరీ వరల్డ్‌లోకి నడిచేందుకు రెడీగా ఉండండి అంటూ ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చారు. మరి విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో రేపు విడుదలయ్యే ట్రైలర్‌తో ఓ అంచనాకు వచ్చేయంటున్నారు ఈ వార్త చదివిన సినీ జనాలు. మొత్తానికి రజినీకాంత్ తర్వాత విరూపాక్షతో సాయిధరమ్ తేజ్ తన మార్క్‌ను చూపిస్తాడా..? లేదా..? అనేది చూడాలి.
SDT15వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న విరూపాక్ష టైటిల్ గ్లింప్స్ వీడియో, టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
విరూపాక్ష టీజర్..
విరూపాక్ష తెలుగు టైటిల్ గ్లింప్స్ వీడియో..
రిస్కీ బైక్ స్టంట్ గ్లింప్స్ వీడియో..
Thiruveer | మసూద హీరో తిరువీర్ పీరియాడిక్ సినిమా.. వివరాలివే
Project K | ప్రభాస్ ప్రాజెక్ట్ Kలో విలన్ ఆర్మీ రైడర్స్ ఎలా ఉండబోతున్నారంటే..?
Vakeel Saab 2 | వకీల్‌సాబ్ 2 ఆన్ ది వే.. క్రేజీ న్యూస్‌తో అభిమానులు ఖుషీ!