Vijay Devarakonda – Jasleen Royal | ‘హీరియే..’ గీతంతో పాపులర్ అయిన బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్, విజయ్ దేవరకొండ కలిసి చేసిన ‘సాహిబా’ ఆల్బమ్ 100 మిలియన్ వ్యూస్‌ను దాటింది. ఈ విషయాన్ని జస్లీన్ రాయల్ తన యూట్యూబ్ ఛానెల్లో అధికారికంగా ప్రకటించారు. గతేడాది విడుదలైన ఈ పాట అతి తక్కువ సమయంలోనే శ్రోతల హృదయాలను గెలుచుకుంది. ఈ పాటలో విజయ్ దేవరకొండ, రాధికా మదన్ కలిసి నటించగా.. జస్లీన్ రాయల్ ఈ పాటను కంపోజ్ చేసింది. సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మెలోడీ ప్రధానంగా ప్రేమలోని సున్నిత భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగడంతో తాజాగా 100 మిలియన్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా జస్లీన్ రాయల్, విజయ్ దేవరకొండ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే కేరళలో ఓ షెడ్యూల్ జరిగింది. ఈ సినిమాతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ.