సత్య యాదు, ఆరాధ్యదేవి జంటగా నటించిన చిత్రం ‘శారీ’. ‘టూమచ్ లవ్ కెన్ బీ స్కేరీ’ ఉపశీర్షిక. గిరి కృష్ణకమల్ దర్శకుడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకాలపై రవిశంకర్ వర్మ నిర్మించారు. ఈ నెల 28న విడుదల కానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘సోషల్‌మీడియాలో తెలియని వారితో పరిచయాలు పెంచుకొని, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో తెలియకుండా నమ్మేయడంతో ఎదురయ్యే ప్రమాదాలు, భయంకర సంఘటనలు మనం చాలా విన్నాం. చూశాం. అలాంటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది’ అంటూ దర్శకనిర్మాత రామ్‌గోపాల్‌వర్మ వాయిస్ ఓవర్లో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాత తెలిపారు.