Bro | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం బ్రో (Bro The Avatar). సముద్రఖని (Samuthirakani) డైరెక్ట్ చేస్తున్నాడు. యువ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన బ్రో టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. జులై 28న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఎస్ థమన్ టీం మ్యూజికల్ బ్లాస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తాజాగా బ్రో ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించాడు థమన్ (S Thaman).
ఫస్ట్ సాంగ్ మై డియర్ మార్కండేయ లోడింగ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఎప్పుడు లాంఛ్ చేసేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశాడు. బ్రో నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో స్టోరీ ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పాడు సముద్రఖని.
ఇటీవలే బ్రో డబ్బింగ్ పనుల్లో కూడా పాల్గొన్నాడు పవన్ కల్యాణ్. బ్రో చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు సమాచారం.
#MydearMarkandeya 🔥#BroFirstSingle 🎧🔊 pic.twitter.com/ekoIb172rV
— thaman S (@MusicThaman) July 6, 2023
బ్రో టీజర్..