S.S.Rajamouli | టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లిన కీరవాణి తాజాగా పద్మశ్రీ అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో బుధవారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కీరవాణి పద్మశ్రీ పురస్కారం తీసుకున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం బుధవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు. కీరవాణితో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి త్రియండి చినజీయర్ స్వామి పద్మభూషణ్ అందుకున్నాడు.
ఇక కీరవాణి పద్మశ్రీ అందుకోవడంతో రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. పెద్దన్నను చూస్తుంటే గర్వంగా ఉందంటూ కీరవాణితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోపై పలువురు నెటీజన్లు స్పందిస్తూ ఈ ఫోటోలో ఇద్దరూ పద్మ అవార్డు గ్రహితలున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాటు నాటు పాటతో కీరవాణి టాలీవుడ్ సినిమాను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లాడు. తన పాటతో విదేశీయులతో స్టెప్పులు వేయించాడు. కలలో కూడా చూడలేమనుకున్న ఆస్కార్‌ను గెలిచి.. టాలీవుడ్‌ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టాడు. అకాడమీ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా నాటు నాటు గెలుచుకుంది.
So proud of my Peddanna…!!!🤗 pic.twitter.com/H3k07KsnmZ
— rajamouli ss (@ssrajamouli) April 6, 2023