Kantara Chapter 1 | కన్నడ నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘కాంతార’ (Kantara). 2022లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సినిమాకు తాజాగా ప్రీక్వెల్‌గా రాబోతుంది. ‘కాంతార ఏ లెజెండ్’ అంటూ ఈ సినిమా రానుండగా.. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ ఇటీవలే విడుదల చేశారు. ‘కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్ జన్మించాడు’ అంటూ రిషబ్ లుక్‌ను రివీల్ చేశారు. ఇక ఈ పోస్టర్లో నెత్తుటితో తడిచిన దేహంతో రిషబ్ లుక్ భయపెట్టేలా ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ.. సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ‘కాంతార టీమ్ నుంచి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సప్తమి గౌడ, కిషోర్ మరియు ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించనున్నారు. హోంబలే ఫిల్మ్స్, కాంతారా సినిమాని నిర్మిస్తుంది. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ప్రీక్వెల్‌గా రానున్న ఈ సినిమాలో రిషబ్ తండ్రి జీవితం, ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళారు, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి అంశాలను హైలెట్ చేసి చూపించబోతున్నట్లు టాక్.