కన్నడంలో విజయవంతమైన ‘సప్తసాగర దాచే ఎల్లో’ (తెలుగులో ‘సప్తసాగరాలు దాటి’) చిత్రం ద్వారా యువతరానికి చేరువైంది కథానాయిక రుక్మిణి వసంత్. ఈ భామ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేస్తున్నది. ఆమె కథానాయికగా నటించిన తాజా కన్నడ చిత్రం ‘బఘీర’ నేడు ప్రేక్షకులముందుకొస్తున్నది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ కథనందించిన ఈ చిత్రానికి డా॥ సూరి దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సందర్భంగా రుక్మిణి వసంత్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇదొక సూపర్‌హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ తరహా సినిమాల్లో కథానాయికల పాత్రలకు అంతగా ప్రాధాన్యత ఉండదని అంటారు. కానీ నా క్యారెక్టర్ కథాగమనంలో చాలా కీలకంగా ఉంటుంది. ఇందులో నేను స్నేహ అనే డాక్టర్ పాత్రలో కనిపిస్తా. ఈ కథలో ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు చక్కటి లవ్‌స్టోరీ కూడా ఉంటుంది’ అని చెప్పింది. ‘సప్తసాగరాలు దాటి’ చిత్రం త ర్వాత అభినయప్రధాన పాత్ర లు లభిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది రుక్మిణి వసంత్. తన కెరీర్లో దీపావళి సందర్భంగా విడుదలవుతున్న తొలి సిని మా ఇదేనని, ఈ ఏడాది తనకు నిజమైన దీపావళిలా అనిపిస్తున్నదని ఆ మె ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయని, ఆ వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పింది.