HER Chapter 1 Trailer | టాలీవుడ్ భామ రుహానీ శర్మ (Ruhani Sharma) టైటిల్ రోల్పోషిస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ HER Chapter 1. శ్రీధర్ స్వరాఘవ్ స్టోరీనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన HER Chapter 1 టీజర్ సినిమాపై క్యూరియాసిటి పెంచుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇలానే చూడాలనుకున్నావా..? స్వాతిని అని బాధితురాలి గురించి ఏసీపీ రుహానీ శర్మ నిందితుడిని ఇన్వెస్టిగేట్ చేసే సన్నివేశాలతో షురూ అయింది ట్రైలర్.
స్వాతి అనే అమ్మాయి హత్యకు సంబంధించిన కేసును చేధించే క్రమంలో కథ ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్. సస్పెన్స్ క్రైం ఎలిమెంట్స్‌తో సాగుతున్న ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ధీరే ధీరే (Dheere Dheere Song) లిరికల్ వీడియోసాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో సినిమా బండి ఫేం వికాస్ వశిష్ఠ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. జీవన్, రవి వర్మ, ప్రదీప్ రుద్ర, సంజయ్ స్వరూప్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని డబుల్ అప్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో రఘు సంకురత్రి, దీపికా సంకురత్రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డబుల్ అప్ మీడియా బ్యానర్‌కు ఇది తొలి సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో రుహానీ శర్మ ఏసీపీగా కనిపించనుంది.
6 నెలల సస్పెన్షన్ తర్వాత ఏసీపీ రుహానీ శర్మకు ఉన్నతాధికారి ఒకరు ఓ యువతి మిస్టరీ డెత్ కేసును చేధించే డ్యూటీ వేస్తారు. రుహానీ శర్మ ఆ కేసును కేసు చేధించే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నదనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఆడియో హక్కులను సరిగమసౌత్ దక్కించుకుంది.
HER Chapter 1 ట్రైలర్..
HER Chapter 1 టీజర్..
ఏసీపీ లుక్‌లో రుహానీ శర్మ..
The intense & intriguing first look of @iRuhaniSharma ‘s investigative thriller #HER is out now@sswaraghav @doubleupmediaa#DeepaSankuratri#RaghuSakuratri #Pavan #VishnuBesi #ChanakyaToorpu@PROSaiSatish#HERChapter1#HERFirstLook #HER pic.twitter.com/5Xf7AFzotC
— BA Raju’s Team (@baraju_SuperHit) December 8, 2022