వీరబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో కనకదుర్గ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల నటుడు ప్రకాశ్‌రాజ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అనంతపురం జిల్లా ‘రుద్రాక్షపురం’ అడవిలో 2018లో జరిగిన ఓ యథార్థ ఘటనను ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రమిది. సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగే హారర్ థ్రిల్లర్ మెప్పిస్తుంది’ అన్నారు. పవన్ వర్మ, పూజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ.