మాస్ మహారాజా రవితేజ(ravi teja) వరుస సినిమాలతో మంచి జోరు మీదున్నాడు. ‘క్రాక్’ సినిమా సక్సెస్ తో మంచి హిట్ కొట్టిన రవితేజ తను చేస్తున్న సినిమా పూర్తి కాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ (67వ) సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రమేష్ వర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇక రవితేజ 68వ సినిమాను శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఇక‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ సినిమాను చేయనున్నాడు. ఈ చిత్రానికి ధమాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.
తాజాగా రవితేజ 70వ సినిమాపై ప్రకటన వచ్చింది. రేపు ఉదయం 10.08 ని.లకు చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రవితేజ జోరుకి అందరు ఆశ్చర్యపోతున్నారు.