Mahavatar Narsimha | హిందూ పురాణాల నేపథ్యంతో రూపొందిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కన్నడలో అగ్ర నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 278 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, యానిమేటెడ్ చిత్రాల చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం జూలై 25న విడుదలైంది. హిందూ పురాణాలలోని శ్రీమహావిష్ణువు దశావతారాలను ఆధారంగా చేసుకుని ఏడు భాగాలుగా రూపొందించే ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో ఇది మొదటి భాగం. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ భారీ విజయం యానిమేటెడ్ చిత్రాలకు భారతదేశంలో మంచి భవిష్యత్తు ఉందని నిరూపించింది.