జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం లంబోర్ఘిని అనే లగ్జరీ కారుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇండియాలో ఈ కారు కొన్న తొలి పర్సన్ ఎన్టీఆర్ కాగా, ప్రస్తుతం ఈ కారులో రయిరయిమంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌కి ఇదే కారులో వచ్చాడు. షూటింగ్ పూర్తయ్యాక లాంబోర్గినీ కారులో ఎన్టీఆర్ ముందు వెళుతుండగా రామ్ చరణ్ ఫెరారీ కారు దాని వెనకు వెళుంది.
ఏదో రేసు మాదిరిగా దీనిని చిత్రీకరించిన ఆర్ఆర్ఆర్ టీం తమ ట్విట్టర్లో షేర్ చేస్తూ.. దానికి టైగర్ వర్సెస్ చీతా అనే కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది. నిజానికి రెండు కార్లు కూడా రామోజీ ఫిలిం సిటీ రోడ్డు మీద ఇలా కనువిందు చేశాయి. గురువారం రామ్ చరణ్,ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది చిత్ర బృందం.
సినిమా గ్రాఫిక్స్ వర్క్‌కి చాలా సమయం పడుతున్న నేపథ్యంలో చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయడం కష్టం అని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇక రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో కనువిందు చేయనున్నారు. డీవీవీ దానయ్య చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
TIGER and CHEETAH…🐅🐆
— RRR Movie (@RRRMovie) August 26, 2021
Leaving the set after wrapping up their last shot for the movie today!#RRRMovie @tarak9999 @alwaysramcharan pic.twitter.com/ttpthr8ifn