ఆర్ఆర్ఆర్ అభిమానులకి బిగ్ షాక్. గత కొద్ది రోజులుగా పోస్టర్స్, పాటలతో సందడి చేస్తూ వస్తున్న చిత్ర బృందం డిసెంబర్ 3న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. కాని ట్రైలర్ వాయిదా పడనుందంటూ ప్రచారం జరుగుతుంది. పలు కారణాల చేత ఈ రిలీజ్ ని వాయిదా వేశారట. దీనిపై అధికారిక క్లారిటీ మరియు కొత్త డేట్ కూడా ఇవ్వనున్నారని తాజా సమాచారం. మరి ఇందులో ఎంతమేర నిజముందో చూడాలి.
బాహుబలి లాంటి సంచలనాత్మక చిత్రాన్ని రూపొందించిన రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్నారు. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన వీరనాటు సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ మధ్య విడుదలైన జననీ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు వీరులను కలిపే ప్రయత్నం చేస్తున్నాడు జక్కన్న. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు.