తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకదిగ్గజం రాజమౌళి.ఇంత వరకు ఓటమి అనేదే తెలియని రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు కూడా నీరాజనాలు పలికారు.ఆయన తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్,రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే మూవీ చేస్తున్నాడు. జనవరి 7న విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ రోజు రాజమౌళి బర్త్ డే సందర్భంగా “రౌద్రం రణం రుధిరం” సినిమాలో కీలక పాత్రలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు జక్కన్నకు తమ స్పెషల్ విషెష్ ని తెలియజేసారు. తారక్ డియర్ జక్కన హ్యాపీ బర్త్ డే టు యు లవ్ యూ అంటూ చెప్పగా, అజయ్ దేవగణ్ మాత్రం తనకి ఎంతో అద్భుతమైన వర్క్ ఎక్స్ పీరియన్స్ అలాగే ఎంతో నేర్పించిన దర్శకుడు రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలియజేసారు. ముగ్గురు స్టార్స్ ఆన్‌లొకేషన్ స్టిల్స్ విడుదల చేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
I look up to in many ways & admire the strength he portrays through his simplicity. Happy Birthday Rajamouli Garu. @ssrajamouli 🎉❤️🎂 pic.twitter.com/8tB2EJN7Um
— Ram Charan (@AlwaysRamCharan) October 10, 2021
Very many happy returns of the day Rajamouli Garu🙏🏼. Its a memorable experience working & learning from you.@ssrajamouli @RRRMovie pic.twitter.com/iBtsK6HeKu
— Ajay Devgn (@ajaydevgn) October 10, 2021
Happy Birthday dear Jakkana @ssrajamouli. Love you ❤️ pic.twitter.com/pCSTgQB1R9
— Jr NTR (@tarak9999) October 10, 2021