గురువారం 09 జూలై 2020
Cinema - Apr 02, 2020 , 13:46:12

అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి హ్యాండ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం..!

అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి హ్యాండ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీం..!

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా అజ‌య్ న‌టిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ, ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై క్లారిటీ లేదు. అయితే ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచింది. ఉగాది కానుక‌గా మోష‌న్ పోస్ట‌ర్ వీడియో, చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ వీడియో రిలీజ్ చేశారు.

ఈ రోజు అజ‌య్ దేవ‌గ‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ‌స్ట్ లుక్ వీడియో అవుతుంద‌ని అభిమానులు భావించారు. కాని క‌రోనా క్రైసిస్ కార‌ణంగా టీం అంద‌రు ఇంటికే ప‌రిమితం కావ‌డంతో డీఐ, మ్యాజిక్ పూర్తి కాలేదు. దీంతో అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి సంబంధించిన వీడియో వాయిదా ప‌డింది. లాక్ డౌన్ త‌ర్వాత త‌ప్ప‌క విడుద‌ల చేస్తామ‌ని అంటుంది ఆర్ఆర్ఆర్ టీం.ఇప్ప‌టికే చిత్ర బృందంతో క‌లిసి కొంత షూటింగ్ చేసిన అజ‌య్ దేవ‌గణ్ త‌ర్వాతి షెడ్యూల్‌లోను జాయిన్ కానున్నాడు.  రౌద్రం రణం రధిరం‌ అనే టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జనవరి 8న విడుద‌ల కానున్న సంగతి తెలిసిందే

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo