అక్టోబర్ 13న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల చిత్రానికి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేసి అంచనాలు భారీగా పెంచిన ఆర్ఆర్ఆర్ టీం తాజాగా షూటింగ్ గ్యాప్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ఎలా చిల్ అవుతున్నారో ఓ వీడియో ద్వారా చూపించారు.
తాజాగా విడుదలైన వీడియోలో ఎన్టీఆర్ నుదురు దగ్గర గాయం అయినట్టుగా అభిమానులు గుర్తించి తమ అభిమాన హీరోకి ఏమైంది అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీం అది మేకప్ అని క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల హార్ట్ బీట్ కాస్త తగ్గింది. సినిమా షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్ అలా గాయంతో కనిపించాడని, నిజంగా గాయం కాదు అని తెలియడంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ ఉక్రెయిన్లో ఉన్న సంగతి తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా… అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా ఈ పాన్-ఇండియా చిత్రం రాబోతోంది.