దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా జపం చేస్తున్న ఒకే ఒక్క పేరు ఆర్ఆర్ఆర్ (RRR). ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి అప్ డేట్స్, ప్రమోషన్స్, రిలీజ్, ఫైనల్‌గా రికార్డులు, కలెక్షన్లు..ఇలా ఆర్ఆర్ఆర్ గురించి విడుదలయ్యే వరకు..ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటూనే ఉంటారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్ఆర్ఆర్ కు ఇప్పటివరకు వచ్చిన క్రేజే దీనికి నిదర్శనం. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ విడుదలవుతూ సినీ ప్రియుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ రన్నింగ్ టైంకు సంబంధించిన న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్‌ను రౌండప్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు ఉంటుందని లేటెస్ట్ టాక్. మొత్తానికి జక్కన్న టీం ప్రేక్షకులను థియేటర్లలో 3 గంటలు సీట్లలో నుంచి లేవనీయకుండా చేయడం ఖాయమని ఈ అప్ డేట్‌తో తెలిసిపోతుంది.
డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీమ్ రోల్లో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్గన్, అలియాభట్, శ్రియా శరణ్, హాలీవుడ్ భామ ఒలీవియా మొర్రీస్ కీ రోల్స్ పోషిస్తున్నారు.