దర్శక ధీరుడు రాజమౌళి ఊరించి ఉసూరుమనిపిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆయన తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. అక్టోబర్ 13న రావడం పక్కా అని పలు పోస్టర్స్ కూడా విడుదల చేశారు. కాని సడెన్గా ఈ మూవీ మరో సారి వాయిదా పడిందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టకపోవడం,దసరా బరిలో పలు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా వాయిదా పడడం పక్కా అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.
సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ వస్తుందని ప్రచారం జరుగుతుండగా, ఆ సమయానికి భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధే శ్యామ్, ఎఫ్ 3 వంటి చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రావడం కష్టమేనని కొందరి అభిప్రాయం. తాజా సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ ని జనవరి 7న విడుదల చేయనున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. అది కుదరకపోతే ఉగాదికే అంటున్నారు.
రామ్చరణ్-తారక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దోస్తీ’ పాట విశేషంగా ఆకట్టుకుంది. ఆలియాభట్, అజయ్ దేవ్గణ్, శ్రియ, సముద్రఖని, ఎలిసన్ డ్యూడీ, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.