RRR | ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన అంశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఒకటి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ‘జననీ’ సాంగ్ ప్రోమో అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. చాలా ఎమోషనల్‌గా సాగిన ఈ పాటలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా కనిపించాడు. ఆయన చెప్పే డైలాగ్ కూడా ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించింది.
ఈ క్రమంలో అజయ్ దేవగణ్ మీడియాతో మాట్లాడాడు. జక్కన్న రాజమౌళితో పని చేసిన అనుభవం చాలా గొప్పగా ఉందని చెప్పాడు. రాజమౌళి ఆలోచనా విధానమే మైండ్ బ్లోయింగ్‌గా ఉందని మెచ్చుకున్నాడు.
‘రాజమౌళి సినిమాను ఒక వేడుకలా తెరకెక్కిస్తారు. నేను పని చేయడానికి వెళ్లినప్పుడు ఎలా ఉంటుందని ఊహించుకున్నానో.. అంతా నాకు దక్కింది’ అని అజయ్ దేవగణ్ చెప్పాడు.
కాగా, రాజమౌళి గతంలో సునీల్ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ చిత్రాన్ని హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేశాడు. ’సన్ ఆఫ్ సర్దార్‘గా తెరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.