బాహుబలితో చరిత్ర సృష్టించిన రాజమౌళి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అక్టోబర్ 13న చిత్రాన్ని విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ ప్రకటించినా కూడా ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజమౌళి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
“రౌద్రం రణం రుధిరం” సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ కాస్త కఫ్యూజన్ గా ఉన్నారా అనిపిస్తుంది.సంక్రాంతి బరిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారని టాక్స్ వినిపిస్తున్న క్రమంలో మరో పాన్ ఇండియన్ సినిమా ‘రాధే శ్యామ్’ తమ రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని జనవరి 14న విడుదల కానుందని తెలియజేశారు.దీంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్‌పై మళ్లీ సందేహాలు అలుముకున్నాయి.ప్రస్తుతానికి అయితే జనవరి 8న అని బజ్ వినిపిస్తుంది, లేదా ఉగాదికి విడుదల కానుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.