యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందించగా, ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’, ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించినప్పటికీ వాటిల్లో తారక్-చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు.
తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో తొలి సారి రామ్ చరణ్- ఎన్టీఆర్ జంటగా కనిపించే సరికి అభిమానులు పూనకంతో ఊగిపోతున్నారు. రాజమౌళి అత్యద్భుతంగా సన్నివేశాలని చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ గ్లింప్స్ మూవీపై భారీ అంచనాలు పెంచిందనే చెప్పాలి. కేవలం 45 సెకన్లు ఉన్న ఈ వీడియోలో డైలాగ్స్ ఏం లేకుండా కేవలం ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మాత్రమే చూపించారు. వీడియో ఆకట్టుకునేలా ఉంది. రానున్న రోజులలో మూవీకి సంబంధించి మరింత జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.జనవరి 7న సినిమాని థియేటర్స్‌లోకి తీసుకురానున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా “ఆర్ఆర్ఆర్” విడుదల తేదీ చాలా సార్లు వాయిదా పడింది. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది.
The era of #RRRMovie has just begun!
— RRR Movie (@RRRMovie) November 1, 2021
Presenting the much anticipated #RRRGlimpse…https://t.co/khszq8EcOg
Let's together bring back the glory of Indian cinema. In cinemas from 7th Jan 2022.@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @DVVMovies