పోకిరి సినిమాతో రీరిలీజ్ ట్రెండ్ మొదలైంది. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి రీరిలీజవగా..మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. ఇక ఇపుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kayan) వంతు వచ్చింది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా జల్సా ( Jalsa ReRelease) సినిమాను మళ్లీ విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సాంకేతిక పనులు కూడా పూర్తయినట్టు సమాచారం. కాగా ఇపుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఆర్ఆర్ఆర్ను యూఎస్ఏలో పంపిణీ చేసిన సరిగమ సినిమాస్ (Sarigama Cinemas) జల్సాను యూఎస్ఏలో రీరిలీజ్ చేయనుంది. డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే రీరిలీజ్ భారీ స్థాయిలో ఉండనుండటమే కాకుండా థియేటర్ల జాబితా కూడా ప్రకటించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన జల్సా చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించారు.
ఇలియానా, కమలినీ ముఖర్జీ,పార్వతి మెల్టన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించగా..శివాజీ, ముఖేశ్ రిషి, ప్రకాశ్ రాజ్, అలీ, తనికెళ్లభరణి ఇతర పాత్రల్లో నటించారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచింది.