S.S RAjamouli | టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక సాడ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజమౌళి ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలకు సెంథిల్ కెమెరా మెన్ గా పనిచేశాడు. ఈ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. అయితే తాజాగా వస్తున్న రాజమౌళి, మహేశ్ బాబు ప్రాజెక్ట్ నుంచి సెంథిల్ తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.
దీనికి కారణం సెంథిల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఈ ప్రాజెక్ట్‌ను చేయట్లేదని తెలిపాడు. ఫ్యూచర్లో కొత్త టెక్నాలజీతో సరికొత్త అవకాశాలు వస్తాయని.. ఏ టెక్నాలజీ అయిన మనం తీసుకొనే దాన్ని బట్టి ఉంటుంది. భవిష్యత్‌లో కొత్తగా మళ్లీ అవకాశాలతో వస్తాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చాడు. అయితే సెంథిల్ మాటలు విన్న అభిమానులు రాజమౌళికి సెంథిల్‌కి గొడవ ఏమైనా జరిగిందా అని మాట్లాడుకుంటున్నారు. కాగా సెంథిల్ ఉన్నాడా లేదా అనేది త్వరలోనే తెలియనుంది.