ఒలీవియా మోరిస్.. ఒకప్పుడు ఈ పేరు ఎవరికి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా కథానాయికగా ఈ అమ్మడిని ఎంపిక చేశారో ఒక్కసారిగా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈమె గురించి ఆరాలు తీయడం మొదలు పెట్టారు. హాలీవుడ్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్, సీరియల్స్ చేసిన ఒలీవియా ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ఎన్టీఆర్‌తో జోడీ కట్టింది.
ఆర్ఆర్ఆర్’(రౌద్రం,రణం, రుధిరం) షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఈ హాలీవుడ్ బ్యూటీ, శనివారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో చక్కర్లు కొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అనురెడ్డితో కలిసి ఆమె శిల్పారామం వెళ్లారు. అక్కడి అందాలు చూసి తన్మయత్వం చెందారు. అనంతరం సిటీలో చిరుతిళ్లు ,పానీ పూరీలు తింటూ సందడి చేశారు. ఈ సందడికి సంబంధించిన పిక్స్ ఒలీవియా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.
స్వాతంత్య్రం కోసం ధైర్యసాహసాలతో పోరాడే కొమురం భీమ్(ఎన్టీఆర్)తో ప్రేమలో పడే బ్రిటిష్ వనిత పాత్రను ఒలీవియా చేస్తున్నారు.ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్ చరణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది.