RRR 2| ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. ఇక బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది.ఇక రీసెంట్గా ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్, ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. ప్రపంచ వేదికలపై ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ అరుదైన ఘనత సాధించడంతో తెలుగు ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన ప్రీమియర్‌కి రామ్ చరణ్, ఎన్టీఆర్ దంపతులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన విజువల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ వీడియో షేర్ చేయగా, ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్.. రాజమౌళి ఆటపట్టిస్తూ ఉండడం మనం గమనించవచ్చు. వారిద్దరు చేసే అల్లరికి రాజమౌళి భయపడిపోతున్నారు. ఇక ఉపాసన రాజమౌళిని ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగింది రాజమౌళి గారు ఇప్పుడు మీరు ఆర్ఆర్ఆర్ 2 చేస్తారా అని ప్రశ్నించింది. దీనికి రాజమౌళి ఎస్ అని సమాధానం చెప్పడతంతో వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యు అని స్పందించింది. దీంతో ఆర్ఆర్ఆర్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో అనే చర్చ మొదలైంది. రాజమౌళి సీరియస్‌గానే చెప్పారా, లేక సరదాగా స్పందించారా అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
ఏది ఏమైన మరోసారి ఆర్ఆర్ఆర్ 2 చర్చ ఫ్యాన్స్ లో మొదలైంది. ఇక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఎన్టీఆర్, చరణ్ మరోసారి తమ బాండింగ్ చాటుకొని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశారు. రామ్ చరణ్ అయితే ఎన్టీఆర్‌ని హగ్ చేసుకొని ముద్దు కూడా పెట్టారు. ఇక జూనియర్‌కి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ కూడా తెలియజేశారు. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. చరణ్ లాంటి బెస్ట్ డాన్సర్ తో నాటు నాటు సాంగ్ పాటకి డాన్స్ చేయడం మరిచిపోలేని అనుభూతి అని తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించారు. స్వాతంత్ర సమర యోధుల పాత్రల ఆధారంగా రాజమౌళి కల్పిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.