యువ హీరో రోషన్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం రోషన్ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన్ని ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పరిచయం చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ మైదానంలో, జీవితంలో నిజమైన ఛాంపియన్‌గా నిలవడానికి అతను చేసే ప్రయత్నాన్ని ఆవిష్కరించారు. రోషన్ పవర్ఫుల్ లుక్స్‌తో కనిపించారు. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాణం: స్వప్న సినిమా, అనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం.