HomeCinemaRoshan New Movie Champion Pooja Ceremony By Director Nag Ashwin
‘చాంపియన్’ మొదలైంది
రోషన్ కథానాయకుడిగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్' శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు నాగ్అశ్విన్ క్లాప్‌నిచ్చారు.
రోషన్ కథానాయకుడిగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’ శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు నాగ్అశ్విన్ క్లాప్‌నిచ్చారు. ఈ సినిమాలో హీరో రోషన్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని చిత్రబృందం పేర్కొంది.
ఈ సినిమా కోసం రోషన్ కంప్లీట్ మేకోవర్ అయ్యారని, ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, ఆర్ట్: తోట తరణి, నిర్మాణ సంస్థలు: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం.