Mowgli Teaser | టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు, యువ నటుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మౌగ్లీ 2025’ (Mowgli 2025). ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ మూవీ టీజర్‌ను నవంబర్ 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ విడుదల తేదీని వెల్లడిస్తూ రోషన్ కనకాల ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఒక ఆసక్తికరమైన అనౌన్స్మెంట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో రోషన్ సరసన సాక్షి సాగర్ మదోల్కర్ (Sakshi Sagar Mhadolkar) నటిస్తున్నారు. వైవా హర్ష ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.
చూచి రమ్మనినా… కాల్చి వచ్చినా… 🔥
Get ready to experience the WILD rush of EMOTIONS with #MowgliTeaser ❤️🔥#Mowgli Teaser on November 12th 💥💥💥
A @SandeepRaaaj Cinema
A @Kaalabhairava7 musical #Mowgli2025 GRAND RELEASE WORLDWIDE on 12th DEC 2025 💥🌟ing… pic.twitter.com/byjg9rgQJD
— BA Raju’s Team (@baraju_SuperHit) November 8, 2025