‘బబుల్గమ్’ సినిమాతో మంచి ఈజ్ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందనున్న ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీ ‘మోగ్లీ’. ‘కలర్‌ఫొటో’ఫేం సందీప్ రాజ్ దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వినాయకచతుర్థి సందర్భంగా ఈ న్యూ ప్రాజెక్ట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ సినిమాకోసం సందీప్‌రాజ్ అద్భుతమైన కథ సిద్ధం చేశారని, ‘మోగ్లీ’లో యూనిక్ రోల్లో రోషన్ కనిపించనున్నారని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో.. దట్టమైన అడవి నేపథ్యంలో, ఓ చేత్తో గుర్రాన్ని పట్టుకొని.. సాలిడ్ ఫిజిక్‌తో, చిరునవ్వును చిందిస్తున్న రోషన్ ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలావుంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి.ఎం, సంగీతం: కాలభైరవ.