రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్‌ఫొటో’ఫేం సందీప్‌రాజ్ దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే మొదలుకానుంది. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
విభిన్నమైన కథ, కథనాలతో ఈ సినిమా రూపొందనున్నదని ద్శకుడు సందీప్‌రాజ్ తెలిపారు. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ కాంటెంపరరీ ప్రేమకథలో రోషన్ కొత్త కోణంలో కనిపిస్తారని ఆయన చెప్పారు. ‘మోగ్లీ’ తర్వాత రోషన్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.