Devara | తారక్ ‘దేవర 1’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. వచ్చే వారం నుంచి ఎన్టీఆర్, జాన్వీకపూర్‌లపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను ప్లాన్ చేశారు కొరటాల శివ. దీనికోసం హైదరబాద్ శివార్లలో భారీ సెట్‌ను కూడా నిర్మిస్తున్నారు.
ఈ పాటతో ‘దేవర 1’ టాకీ మొత్తం పూర్తవుతుందని తెలుస్తున్నది. సైఫ్ ఆలీఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తారక్, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ సీన్స్ మాస్ ప్రేక్షకులను ఓ స్థాయిలో అలరిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. సెప్టెంబర్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్ ఇతర పాత్రధారులు. అనిరుథ్ ఈ సినిమాకు స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.