గత కొంతకాలంగా వరుస విజయాలతో జోష్‌మీదున్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘సింగిల్’. కార్తీక్‌రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మే 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. ‘శిల్పి ఎవరో’ అంటూ సాగే రొమాంటిక్ గీతాన్ని విడుదల చేశారు. విశాల్‌చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. తన జీవితంలో ప్రత్యేకమైన ఇద్దరమ్మాయిల వ్యక్తిత్వాన్ని, అందాన్ని వర్ణిస్తూ కథానాయకుడు ఆలపించే ఈ పాట చక్కటి ఫీల్‌తో సాగింది. వినోదభరితంగా సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, నిర్మాతలు: విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి, రచన-దర్శకత్వం: కార్తీక్‌రాజు.