Romantic: పూరీ తనయుడి చిత్రం థియేటర్స్‌లోనే.. రిలీజ్ ఎప్పుడంటే..!

కరోనా వలన భిన్న పరిస్థితులు ఏర్పడడంతో ఏ సినిమా థియేటర్స్‌లో విడుదల అవుతుంది, ఏ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని చెప్పడం కాస్ట కష్టంగానే మారింది. అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్న క్రమంలో చాలా సినిమాలు థియేటర్స్‌లోకి వస్తున్నాయి. తాజాగా పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ నటించిన రొమాంటిక్ చిత్రాన్ని నవంబర్ 4న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.
ఆకాశ్ పురి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీకి పూరి జగన్నాథ్ కథ, కథనం, సంభాషణలు అందించారు. అనిల్ పాదూరి దీనికి దర్శకత్వం వహించారు. ఛార్మి కౌర్ తో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను పూరి జగన్నాథ్ నిర్మించారు. కేతిక శర్మ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘రొమాంటిక్’ కు సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించాడు. మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన కీలక పాత్రలో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

