అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాత సునీల్ నారంగ్ ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
బడ్డీ కామెడీ మూవీ ఇదని, ఆద్యంతం సరదాగా సాగుతుందని, ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేసేలా ఉంటుందని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. ఈ సినిమా ఫస్ట్కట్ చూసి సందీప్‌రెడ్డి వంగా ప్రశంసించారని దర్శకుడు పేర్కొన్నారు. రెండున్నర గంటల నాన్‌స్టాప్ ఎంటర్టైనర్ ఇదని హీరో సుమంత్ ప్రభాస్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వాసుకి వైభవ్.