Roja | రోజా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన రోజా రాజకీయాలలోను రాణించారు. సంచలనాలకి కూడా కేంద్ర బిందువుగా నిలిచింది రోజా. ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మెప్పించింది.. జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు షోలో సందడి చేసింది. ఆ షోతో పాటు మరిన్ని టీవీ షోలలో కూడా అడపాదడాపా కనిపించి సందడి చేసింది. ఎప్పుడు అయితే రోజా మంత్రిగా మారిందో అప్పటి నుండి ఇక ఇండస్ట్రీకి పూర్తిగా దూరం ఉంది.
అయితే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజా మంత్రిగా కొన్ని రోజల పాటు సత్తా చాటింది.అయితే గత ఎన్నికలలో దారుణంగా ఓటమి పాలైన తర్వాత రోజా తిరిగి సినీ ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతుంది. అయితే ఇటు తమిళం, ఇటు తెలుగు ఇండస్ట్రీలోకి రావలన్నా కూడా రోజాకి అటు చిరంజీవి, ఇటు రజనీకాంత్ ల నుండి ఇబ్బంది ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం రోజా ..గతంలో చిరంజీవి, రజనీకాంత్‌లపై పలు విమర్శలు చేసింది. దీంతో ఆమెకి సినిమా అవకాశాలు రావడం లేదని టాక్. మంత్రిగా ఉన్న సమయంలో టీవీ షోలు కూడా వదిలేసిన రోజా ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ షో కొత్త సీజన్ మొదలు కాగా, ఈ షోకి సుధీర్ యాంకర్ గా చేస్తుండగా రోజా, డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జీలుగా చేస్తున్నారు.
తాజాగా డ్రామా జూనియర్స్ మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. దీంట్లో రోజా ఓ పాపతో కలిసి స్కిట్ చేసింది. అత్త కోడళ్ల స్కిట్ చేసి తెగ నవ్వించారు. అత్త పాత్రలో రోజా నటించింది. బోలెడన్ని పంచులు వేసింది. ఎంట్రీలో డ్యాన్స్ కూడా వేసింది. గతంలో రోజా బుల్లితెరపై పలు స్కిట్స్ వేసి అలరించింది. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత రోజా రీ ఎంట్రీ ఇస్తూ స్కిట్ వేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ రేపు శనివారం ఏప్రిల్ 12 రాత్రి 9 గంటలకు జీ తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. రాజకీయాల కన్నా వినోద రంగంలో రోజాకు విశేష గుర్తింపు లభించింది. అయితే రాజకీయాలలోకి వచ్చిన రోజా ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకుని 2004, 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె వైఎస్సార్ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2019లో వరుసగా రెండు సార్లు నగరి నుంచి గెలుపొందారు. రీసెంట్ ఎన్నికలలో ఓడిపోయారు.