90’లలో నటిగా, ఇండస్ట్రీని షేక్ చేసిన రోజా అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తూనే సోషల్ మీడియాలోను హడావిడి చేస్తుంది. ముఖ్యంంగా తన ఫ్యామిలీకి సంబంధించిన పలుఈవెంట్స్ ఫొటోలు ఫేస్ బుక్‌లో షేర్ చేస్తూ నెటిజన్స్‌కి వినోదాన్ని పంచుతూ ఉంటుంది. ఆ మధ్య తన కూతురు అన్షు బర్త్ డే వేడుకలకి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది రోజా.
తాజాగా భర్త బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది రోజా. పిల్లలు ఇద్దరితో కలిసి రోజా బర్త్ డే పార్టీలో తెగ సందడి చేసినట్టు కనిపిస్తుంది. రోజా ఫ్యామిలీ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సెల్వమణి బర్త్ డేని గ్రాండ్‌గా జరపగా, ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఇదిలా ఉంటే రోజా కూతురు తల్లికి తగ్గ తనయ అని అనిపించుకుంటుంది. ఇటీవల
అన్షు మాలిక రైటర్, ప్రోగ్రామర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటడంతో యంగ్ సూపర్ స్టార్ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో ఇన్‌ప్లూయెన్సర్ యూకే మేగజైన్ ఆమె కవర్ ఫోటోను ప్రచురించింది. ఇలాంటి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని అన్షు తెలిపింది.