తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా కోసం బాలకృష్ణ హోస్ట్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్ కి గెస్ట్ గామోహన్ బాబుని రంగంలోకి దించారు.ఆయనతో సినిమా, రాజకీయాలకు సంబంధించి పలు విషయాలపై చర్చించారు. ఇక రెండవ ఎపిసోడ్ కి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరయ్యాడు. ఆయనతో చేసిన సందడి కూడా ప్రేక్షకులకి మాంచి కిక్ ఇచ్చింది.
ఇక రానున్న రోజులలో ఈ షోకి వచ్చే గెస్ట్‌లపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తదుపరి ఎపిసోడ్లో రానున్నాడనే టాక్ వినిపిస్తుండగా, ఇప్పుడు రోజా పేరు కూడా వినిపిస్తుంది. బాలకృష్ణ, రోజా కాంబినేషన్ అంటే వెంటనే అభిమానులకు బొబ్బిలి సింహం, భైరవ ద్వీపం లాంటి క్లాసిక్ హిట్స్ గుర్తుకు వస్తాయి. పెద్దన్నయ్య, మాతో పెట్టుకోకు, సుల్తాన్ లాంటి చిత్రాల్లో కూడా రొమాన్స్ చేసింది.
బాలకృష్ణ, రోజాలు రాజకీయంగా ప్రత్యర్ధులుగా ఉన్న పర్సనల్ లైఫ్‌లో మాత్రం మంచి సాన్నిహిత్యంతో ఉంటారు. ఈ క్రమంలోనే బాలయ్య షోకి రోజా గెస్ట్‌గా హాజరు కాబోతుందనే టాక్ వినిపిస్తుంది. మరి రోజా బాలయ్య షోకి హాజరైతే మాత్రం దబ్బిడదిబ్బడ అవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు.