Roja | ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీని రోజా షేక్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. 90లలో రోజా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత కాస్త సైలెంట్ అయిన రోజా ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చింది. వైసీపీలోకి వచ్చాక ఆమె కొన్నాళ్లు ఎమ్మెల్యేగా చేసింది. ఆ సమయంలో టీవీ షోస్‌లో చేస్తూ జడ్జిగా అలరించింది. ముఖ్యంగా జబర్ధస్త్ కామెడీ షోకి 10 ఏళ్లకి పైగా జడ్జిగా కొనసాగింది రోజా. నాగబాబు, రోజాలు జడ్జెస్‌గా ఉన్న సమయంలో రేటింగ్ కూడా బాగా వచ్చింది. ఇక నాగబాబు వెళ్లిపోయాక కూడా రోజా చాలా రోజుల పాటు జబర్ధస్త్‌కి జడ్జిగా ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్ గా ప్రమోషన్ రావడంతో.. రూల్స్ ప్రకారం జబర్థస్త్ ను వీడాల్సి వచ్చింది.
మినిస్టర్ గా ఉన్నన్ని రోజులు రోజా ఇండస్ట్రీ వైపు చూసింది లేదు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం, రోజా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడంతో ఆమె జబర్ధస్త్ షోకి తిరిగి జడ్జిగా వస్తుందని అంతా అనుకున్నారు. తమిళ్, ఇటు తెలుగులో కూడా రోజా ఛాన్స్ ల కోసం చూసిందట. అయితే మినిస్టర్ గా ఉన్నప్పుడు రజినీకాంత్ ను, టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీని నోటికొచ్చినట్టు రోజా తిట్టడంతో ఇప్పుడు ఆమెకి సినిమా అవకాశాలు రావడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బుల్లితెరపై బిజీ అవ్వాలని రోజా కోరుకుంటుంది.
ఈ క్రమంలోనే రోజా జీ తెలుగులో ఓ షోకి జడ్జిగా చేసే అవకాశం దక్కింది. ఇటీవల రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లో ఒక ఎపిసోడ్ కి మాత్రమే గెస్ట్ గా వచ్చి అలరించింది. ఇప్పుడు రోజా ఫుల్ లెన్త్ బుల్లితెర రీ ఎంట్రీ ఇచ్చేసింది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ మొదలు కాగా, ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రోజా జడ్జిగా వచ్చినట్టు తెలుస్తుంది. షోకి రోజాతో పాటు ఆమనీ, అనిల్ రావిపూడి కూడా జడ్జ్ లు గా కనిపించారు. అయితే రోజా మాత్రం సీజన్ మొత్తం కనిపిస్తారని, మిగతా వారు కొన్ని ఎపిసోడ్స్ కు మారతారని తెలుస్తుంది. ప్రోమోలో రోజా, ఆమని ఇద్దరు జగపతి బాబుతో కలిసి డ్యాన్స్ వేసి అలరించారు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 12 శనివారం నుండి ఈ షో ప్రారంభం కానుంది