90లలో ఎందరో స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్గా ఉన్న రోజా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల చిరంజీవి సినిమా చేస్తే అందులో నటిస్తానని పేర్కొంది. ప్రస్తుతం జబర్ధస్త్‌తో పాటు పలు షోలకు జడ్జిగా ఉంటున్న రోజా మరోవైపు రాజకీయాలతోను బిజీగా ఉంటుంది.
రోజా ఇటీవల తాను పడ్డ కష్టాలను గురించి చెప్పుకొచ్చింది. నేను 1991లో ఇండస్ట్రీకి వచ్చాను.. 2002 వరకు కష్టపడిన మొత్తం కూడా అప్పులే కట్టాను. పెళ్లి చేసుకునే ముందు నాకు సమస్యలు వచ్చాయి.. పిల్లలు పుట్టరు అని చెప్పారు. కానీ పెళ్లైన ఏడాదికి అన్షు పుట్టింది. అందుకే నాకు అన్షు అంటే చాలా ఇష్టం అంటూ రోజా కన్నీరుపెట్టారు.
తాజాగా అన్షు బర్త్ డే వేడుకలని ఘనంగా జరిపింది రోజా. అంతేకాకుండా బర్త్ డే వేడుకకి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేయగా, అవి వైరల్‌గా మారాయి. ఫొటోలలో రోజా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రోజా తన కూతురు అన్షుని సినిమాలలోకి తీసుకురావాలని కూడా భావిస్తుందట.